సత్యసాయి: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.