ASF: సింగరేణి సులబ్ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని సింగరేణి సులబ్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా శనివారం గోలేటి జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..సింగరేణి వ్యాప్తంగా 213 మంది సులబ్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.