AKP: నక్కపల్లి మండలంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేపై హోం మంత్రి శుక్రవారం ఆరా తీసారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు స్వామిత్వ సర్వే వివరాలను తెలియజేశారు. ఈ నెలాఖారులోగా సర్వే పూర్తవుతుందని తెలిపారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు కలిగిన యాజమానులకు యజమాన్య హక్కులు కల్పించేందుకు దీనిని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు.