WGL: తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. MLA కార్యక్రమంలో పాల్గొని, స్థానిక మహిళలకు చీరలు అందచేసారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలు సద్వినియపరుచుకోవాలని ఆయన కోరారు.