సత్యసాయి: టీడీపీ సీనియర్ నాయకుడు జక్కంపూడి సత్యనారాయణ శనివారం ధర్మవరంలో ఎన్డీఏ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత హరీష్ బాబు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ధర్మవరం అభివృద్ధి, కూటమి బలోపేతంపై వారు విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగాలని జక్కంపూడి తన విలువైన సూచనలు అందించారు.