KKD: ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కాకినాడ విద్యార్థులు జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా DFO ఎన్.రామచంద్రరావు వారికి అటవీశాఖ కార్యక్రమాలపై, అలాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.