NGKL:కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను సూపరింటెండెంట్ డా. శివరాం శనివారం పరిశీలించారు. పిల్లర్ ఫౌండేషన్, కంపౌండ్ వాల్ బేస్మెంట్ తదితర పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణాన్ని నాణ్యతగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని బాధ్యులుకు సూచించారు.