సత్యసాయి: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను కొనసాగించాలని సోమందేపల్లి తహసీల్దార్ మారుతికి ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ.. లేబర్ కోడ్ల అమలుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలకు రక్షణ కల్పించి అమలు పరచాలన్నారు.