ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు న్యాయ పరిరక్షణ అధికారి బి. రత్నకుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను మొబైల్ ఫోనుకు దూరంగా ఉండాలన్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు. బాల్య వివాహాలపై జరుగు కష్ట నష్టాలను విద్యార్థులకు తెలియజేశారు.