TG: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, ఏకే 47లు, ఎస్ఎల్ఆర్, భారీగా బుల్లెట్స్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ 37 మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండగా.. అందులో మావో కీలక నేత సాంబయ్య అలియాస్ ఆజాద్ ఉన్నారు.