కృష్ణా: గూడూరు మండలంలో పలు పంట పోలాలను జిల్లా వనరుల కేంద్రం డీడీఏ జ్యోతిరమణి ఇవాళ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క రైతు తన పొలం సాగును తెలుసుకోవటానికి భూసార పరీక్షలు చేయించుకోవాలని, భూసార పరీక్షల ద్వారా నేలల పోషకాల స్థాయిపై రైతుకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు. రామన్నపేట గ్రామంలో రైతు సేవ కేంద్రంలో వ్యవసాయంలో భూ సార పరీక్షల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు.