E.G: రాజానగరం మండలం వెలుగుబంధ గ్రామానికి చెందిన కేతమోలు సతీష్‌కి మంజూరైన రూ.3,50,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా శనివారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.