సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు దన్ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఆదిలక్ష్మమ్మకు టీడీపీ సభ్యత్వ కార్డు ఉండటంతో ఈ బీమా అందిందని హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేష్ కుమార్ తెలిపారు. కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని నాయకులు హామీ ఇచ్చారు.