అన్నమయ్య: చిట్వేలు పట్టణ సమీపంలోని గుంజనేరులో శనివారం ఉదయం ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితమే మృతి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.