TG: సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ.. ప్రభుత్వం GO ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచి పదవులకు.. రాజకీయ పార్టీల సమక్షంలో SC, ST, BC, మహిళలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.