BDK: ములకలపల్లి – పాల్వంచ ప్రధాన రహదారిలో శనివారం సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని 2 మేకలు మృతి చెందాయి. సత్తుపల్లి నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు, ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద రోడ్డుపై ఉన్న మేకల గుంపును ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మేకలు అక్కడికక్కడే మృతి చెందడంతో వాటి యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.