MHBD: బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటైన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని MLA కోరం కనకయ్య ఇవాళ ప్రారంభించారు. క్వింటాల్‌కు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే కొనియాడారు. రెండు పంటకు ఎరువులు అందకపోతే ఇబ్బంది పడుతున్నామని రైతులు వినతి చేయగా, ప్రతి రైతుకూ ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.