CTR: తుఫాను నేపథ్యంలో జిల్లాలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో పలువరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల లోడ్ వచ్చింది. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.