KNR: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ శిఖర యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శాంతి కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రాల మధ్య కార్యక్రమం వైభవంగా జరిగింది. రెండో రోజు శనివారం గోపూజ, యాగశాల ప్రవేశం జరిగింది. ద్వార తోరణం, ధ్వజ కుంభపూజ, అగ్ని ప్రతిష్టపన, మూల, మూర్తి మంత్ర, మన్యుహస్త హోమాలు జరిగాయి.