W.G: ఆకివీడులోని భీమవరం రోడ్డులో గల వినాయక వైన్స్ వెనుక ఉన్న పంట బోదెలో పడి చిన్నపల్లి వీధికి చెందిన మత్స్యకారుడు చిప్పల మల్లి (40) మృతిచెందాడు. బోదెలోని బురదలో కూరుకుపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉంటాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.