NTR: తిరువూరు శ్రీవాహిని ఇంజినీరింగ్ కాలేజీలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కే.మాధురి అధ్యక్షతన అగ్నిపథ్ పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. వింగ్ కమాండింగ్ ఆఫీసర్ యాకుబ్ అలీ విద్యార్థి ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద అగ్నివీర్‌గా చేరడంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమ సీఈవో, తహసీల్దార్ పాల్గొన్నారు.