VSP: గాజువాక సమీపంలోని దుర్గా నగర్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఉక్కు కర్మాగారం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని యువకుడి మొండెం, శరీరం లభ్యమైంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక పరిశీలనలో ఇది ఆత్మహత్యలా కనిపిస్తున్నప్పటికీ, అనుమానాలకు తావుండటంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.