NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న అమ్మవారి దేవాలయం వద్ద శనివారం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దేవాలయానికి ఘాట్ రోడ్డు మీదగా వెళ్లే వాహనాల వలన ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. దీంతో అక్కడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ సిబ్బంది ట్రాఫిక్ ను నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.