W.G: నరసాపురం – లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు పేరును ‘వశిష్ఠ’ లేదా ‘వశిష్ఠ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని జనసేన నాయకుడు పిల్లా నారాయణమూర్తి కోరారు. ఇవాళ భీమవరంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారని మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.