ఏదైనా తినే పదార్థంలో బొద్దింక పడితే మనమైతే దానిని చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, చైనాలోని బీజింగ్ ఓ కీటకాల మ్యూజియంలో ప్రత్యేకంగా ‘బొద్దింక కాఫీ’ని ప్రవేశపెట్టారు. దీని ధర 45 యువాన్లు (US$6). రుచి చూసిన కస్టమర్లు ఇది కాల్చిన – పుల్లటి ఫ్లేవర్ వస్తోందని తెలిపారు. ఈ వింత డ్రింక్ యువతను ఆకర్షిస్తూ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.