ADB: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సేవలందించడంలో విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల ప్రతినిధులు చూపుతున్న సేవ భావన ప్రశంసనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యోగా భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లలలోని లోపాలతో పాటు వారి ప్రతిభను, ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు సమాజంలో సమానంగా ఎదగగలరని అన్నారు.