NDL: బనగానపల్లె పట్టణ సమీపంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. జురెరు వాగు పునర్నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు. వాగు వెంబడి ముళ్లపొదలను తొలగించి పటిష్టమైన రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. వర్షాకాలంలో వరద నీరు ఎంత వచ్చినా బనగానపల్లెకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మంత్రి బీసీ అన్నారు.