NTR:0 విస్సన్నపేటలో శనివారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై వివాహిత గోగిని శ్యామల (25) మృతి చెందింది. ఉదయాన్నే పిల్లలను స్కూలుకు పంపించే సమయంలో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా షాక్ తగిలినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.