SKLM: ఎచ్చెర్లలలో ఎంపీపీ మొదలవలస చిరంజీవి అధ్యక్షతన ఇవాళ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళుతుంటే అన్యాయంగా తనను పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేశారని తెలిపారు. తాను కడిగిన ముత్యం వల్లే బయటికి వచ్చానని పేర్కొన్నారు. అనంతరం సోమవారం జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.