KDP: జమ్మలమడుగు పట్టణంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చెత్త వేయడంతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుందని స్థానికులు వాపోయారు. సరైన సమయానికి మున్సిపల్ వాహనాలు రాకపోవడంతో చెత్తాచెదారం అక్కడ వేస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ స్పందించి చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.