SKLM: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి రూ. 4.50 లక్షలును వసూలు చేసిన ఓ మహిళను అరెస్టు చేసినట్లు పాతపట్నం ఎస్సై మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. పాతపట్నంకి చెందిన జి .మణి ఒడిశా రాష్ట్రంకి చెందిన ప్రదీప్, ఈశ్వర్రావు, లక్షణ రావుకు వ్యవసాయశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించినట్లు బాధితులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. SI కేసు నమోదు చేశారు.