కృష్ణా: ప్రమాదాలకు అధికంగా గురయ్యే పులిగడ్డ జంక్షన్ వద్ద రోడ్డు భద్రతను మెరుగుపరచేందుకు ప్లాస్టిక్ స్పీడ్ బ్రేకర్లను నిన్న ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అవనిగడ్డ సీఐ జీ. యువ కుమార్ అవనిగడ్డ ఎస్సై కే. శ్రీనివాసరావు సమర్థంగా సమన్వయం చేసి పూర్తిచేశారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలో జరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రజల రక్షణకు మరింత సహాయ పడుతుందని తెలిపారు.