ATP: గుత్తిలోని అన్న క్యాంటీన్ సమీపంలోని ఎస్వీఎస్ వైన్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వైన్ షాప్ వెనుక భాగంలో గోడను పగలగొట్టి వైన్ షాప్లో ఉన్న మద్యం బాక్సులను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.