AP: రైతుల సమస్యలు, రాజధాని అభివృద్ధిపై త్రిసభ్య కమిటీలో చర్చించామని MLA తెనాలి శ్రావణ్ తెలిపారు. రైతుల లేఔట్ల అభివృద్ధికి నిర్ధేశిత కాలపరిమితి నిర్ణయించామని, గ్రామాల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. పనులకు సంబంధించి DPRలు సిద్ధమవుతున్నాయని అన్నారు. కొన్నిచోట్ల రైతుల మధ్య సమస్యల కారణంగా ప్లాట్ల కేటాయింపు పూర్తి కాలేదన్నారు.