CTR: కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి శాంతిపురంలోని తన నివాసంలో శనివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను ఆమె తెలుసుకున్నారు. వారికి అండగా ఉండి ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.