TG: JNTUHలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తాను ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇంజినీర్లతో కలిసి పనిచేయాల్సి వస్తోందని తెలిపారు. వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు తనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందని చెప్పారు. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఇంజినీర్లు సులువుగా పరిష్కరిస్తారని కొనియాడారు.