AP: మిగతా ప్రాంతాల్లో అసైన్డ్ చట్టానికి, రాజధానిలో అసైన్డ్ భూములకు వ్యత్యాసం ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 3 నెలలు పడుతుందన్నారు. 90 శాతం రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, రాబోయే 15 ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మరో వారం తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ అవుతుందన్నారు.