భారత్‌లోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సాయంతో ఈ ఆయుధాలను దేశంలోకి తీసుకొస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాక్ ISIతో ప్రత్యక్ష సంబంధాలున్న వీరినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సంజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది.