TG: రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల్లో తీసుకున్న అప్పులను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 7 నెలల్లో రూ.50,541 కోట్లు అప్పు తీసుకున్నారని కాగ్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఈ అప్పు 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుందని చెప్పారు. ఏడాదిలో తీసుకునే అప్పులో 7 నెలల్లోనే 93.58 శాతం పూర్తి అయిందని వెల్లడించారు.