PPM: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు, వారికి సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం హెల్పింగ్ హ్యాండ్స్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. కలెక్టరేట్, ఐటిడిఏ, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.