KNR: ZPHS వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో బీ. శ్రీవర్షిని జగిత్యాల జిల్లా తరఫున అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికయింది. ఈ జట్టు 25వ తేదీ వరకు యాదాద్రి భువనగిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననుంది. వర్షిని ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ఉపాధ్యాయ బృందం, ఆనందం వ్యక్తం చేశారు.