NZB: జిల్లా పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. రేపు మున్నూరు కాపుల జిల్లా అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ పెద్ద కొడుకు, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన తమ్ముడు ధర్మపురి అరవింద్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనే చర్చ మొదలైంది. ఎంపీ అరవింద్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఆహ్వానం పంపారు.