బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ షూటింగ్లో గాయపడింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఈతా’ మూవీ షూటింగ్లో డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. దీంతో మూవీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలివేశారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నాడు.