RR: షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్రామస్థులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ అధికారులను ఆదేశించగా అధికారులు సమస్యను పరిష్కరించారు. ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు MLAకు ధన్యవాదాలు తెలిపారు.