WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో విజ్డం పబ్లిక్ స్కూల్ పక్కన రోడ్డుపై మిషన్ భగీరథ నీటి కుళాయి నుంచి నిరంతరం నీరు వృధాగా పోతుందని స్థానికులు తెలిపారు. ప్రజలకు అందించవలసిన విలువైన మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుంటే అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.