తాజాగా మ్యూజిక్ సంస్థను ప్రారంభించినట్లు మంచు మనోజ్ ప్రకటించాడు. ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్స్ అనే క్యాప్షన్‌తో పోస్టర్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. మ్యూజిక్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఈ సంస్థ ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు సమాచారం.