AP: పోలీస్ ర్యాంకింగ్లో రాష్ట్రం 36వ స్థానానికి పడిపోయిందని వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు కేంద్ర హోంశాఖ రిపోర్టే నిదర్శనమని విమర్శించారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దిగజారుతోందని, కేంద్ర హోంశాఖ రిపోర్టులో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందన్నారు.