కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త నాలుగు కార్మిక కోడ్ల ప్రకారం ఉద్యోగుల తొలగింపు నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 299 మంది వరకు ఉద్యోగులున్న కంపెనీలు ఇకపై ప్రభుత్వ అనుమతి లేకుండానే సిబ్బందిని తొలగించవచ్చు. గతంలో 100 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలకు తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆమోదం అవసరం ఉండేది. దాన్ని 300కు పెంచారు. ఈ మార్పు కంపెనీలకు కొంత వెసులుబాటు కల్పించనుంది.