NDL: బేతంచెర్ల మండలం గ్రామపంచాయతీ సిమెంట్ నగర్ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇవాళ గ్రామంలో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న ల్యాండ్రి కొట్టాల కాలనీలో తాగునీటి కుళాయిలను ప్రారంభించారు. గత కొన్ని ఏళ్ళ నుంచి కాలనీకి పైప్ లైన్ లేక తాగునీటి వసతి లేకపోవడంతో ఎమ్మెల్యే స్పందించి పైప్ లైన్ ఏర్పాటు చేశారు.