KKD: ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. సామర్లకోట రైతు భవన్లో శనివారం గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి 156 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.